iQOO z11 smartphone features sangati

iQOO z11 smartphone features sangati ఈ పోస్టులో చూద్దాం. iQOO Z11 ఫోన్ 144Hz డిస్‌ప్లే, భారీ 9,020mAh బ్యాటరీ మరియు 50MP ప్రధాన కెమెరా వంటి ప్రత్యేకతలను అందిస్తుంది. iQOO మలేషియాలో ఈ కొత్త Z-సిరీస్‌ను విడుదల చేసింది; త్వరలోనే భారతదేశం వంటి ఇతర మార్కెట్లలో కూడా iQOO Z11 విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

iQOO Z11 ఫోన్ స్పెసిఫికేషన్లు144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5,000 nits గరిష్ట ప్రకాశంతో 6.83-అంగుళాల ఫుల్ హెచ్ డి మరియు AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అందువలన ఈ ఫోన్ ఆరుబయట వినియోగానికి మరియు గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్ ప్రముఖ Snapdragon 7s Gen 4 మధ్య-శ్రేణి చిప్‌సెట్ తో రానున్నది; రెగ్యులర్ యూజర్లకు సమర్థవంతమైన పనితీరును అందిస్తుందని పేరుగాంచింది. అయితే, ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ (highlight) ఏమిటంటే, 90W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో కూడిన భారీ 9,020mAh బ్యాటరీ.


కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు 32MP ముందు కెమెరా (selfie camera) ఉన్నాయి. ఈ ధర విభాగంలోని ఫోన్లకు ఈ కెమెరా సెటప్ నార్మల్ గా ఉంటుంది; అంటే జనరల్ ఫోటోగ్రఫీకి ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ హ్యాండ్‌సెట్ dust and water resistant కోసం IP68 మరియు IP69 రేటింగ్‌లను కలిగి ఉంది, అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. Origin OS బాగా పాపులర్ అయ్యింది, ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. iQOO Z10తో పోలిస్తే, iQOO Z11లో మీకు మరింత పెద్ద బ్యాటరీ మరియు వేగవంతమైన చిప్‌సెట్ లభిస్తాయి. ఒకవేళ ఈ ఫోన్ భారతదేశంలో విడుదలైతే, ఇది ఎక్కువగా Motorola Edge 70 Fusion మోడల్‌తో పోటీపడే అవకాశం ఉంది.

cinemasandadi

Leave a Comment