Chrome lo ee trick telusa? Website ను Appలా Home Screen పై పెట్టేయండి!

Chromeలో ఈ ట్రిక్ తెలుసా? Website ను Appలా Home Screen పై పెట్టేయండి! స్మార్ట్‌ఫోన్‌లో Google Chrome ద్వారా ఒక వెబ్‌సైట్ URL‌ను హోమ్ స్క్రీన్‌పై ఐకాన్ రూపంలో షార్ట్‌కట్‌గా క్రియేట్ చేయడం చాలా సులభం. ఇలా చేస్తే ఆ వెబ్‌సైట్ యాప్‌లా ఓపెన్ అవుతుంది.

Android ఫోన్‌లో Chrome ద్వారా Website Shortcut ఎలా Create చేయాలి?

Chrome lo ee trick telusa? Website ను Appలా Home Screen పై పెట్టేయండి!

Step 1:
మీ ఫోన్‌లో Google Chrome ఓపెన్ చేయండి.

Step 2:
మీకు షార్ట్‌కట్ కావాల్సిన వెబ్‌సైట్ URL ను ఓపెన్ చేయండి.
ఉదాహరణకు:
YouTube
Google
Facebook
Reddit
techsangati
మీ స్వంత వెబ్‌సైట్ కూడా కావచ్చు.


Step 3:
పై భాగంలో కుడి వైపు ఉన్న 3 dots (⋮) పై ట్యాప్ చేయండి.

Step 4:
మెనూలో కనిపించే “Add to Home screen” అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.

Step 5:
ఇప్పుడు ఒక popup వస్తుంది:
Shortcut పేరు మార్చుకోవచ్చు.
తర్వాత Add బటన్ నొక్కండి.


Step 6:
ఇప్పుడు ఆ వెబ్‌సైట్ మీ ఫోన్ Home Screen పై ఒక ఐకాన్‌గా కనిపిస్తుంది.

ప్రయోజనాలు
యాప్‌లా ఒక్క ట్యాప్‌తో ఓపెన్ అవుతుంది.
బ్రౌజర్‌లో URL టైప్ చేయాల్సిన అవసరం లేదు.
తరచూ ఉపయోగించే వెబ్‌సైట్లకు చాలా ఉపయోగకరం.

కొన్ని వెబ్‌సైట్లు పూర్తి-screen app లా కూడా పనిచేస్తాయి. Chrome lo ee trick telusa? Website

iPhone (Safari) లో ఎలా?
Safari లో:
1. Website ఓపెన్ చేయండి
2. Share Button నొక్కండి
3. “Add to Home Screen” ఎంపిక చేయండి
4. Add నొక్కండి

ఎక్కువ యాప్స్ ఉండడం వలన, అవి బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే అవకాశం ఉంటే, అవి ఫోన్ పెర్ఫార్మెన్స్ మరియు బ్యాటరీ పై ప్రభావం చూపుతాయి.

కాబట్టే అంతగా అవసరం లేని apps బదులుగా, aa app కు సంబంధించిన వెబ్ సైట్ ను హోమ్ స్క్రీన్ పై షార్ట్ కట్ గా సేవ చేసుకోవడం సులభం, ఉపయోగం.

telugu cinema sandadi

Leave a Comment